హైదరాబాద్, జూలై 14 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అందజేసిన ఎన్యూరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేసి బిఎల్ఒలకు వెంటనే అందజేసి మీ యొక్క ఆమూల్యమైన ఓటుహక్కును కాపాడుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
• బిఎల్ఒలు అందజేసిన ఫారాల్లో ఎలాంటి తప్పులు లేకుండా పూరించి, Passport size photoను అతికించి బిఎల్ఒలకు అందించాలని సిఇఒ కోరారు.
• ఎన్యూమరేషన్ ఫారంలో తప్పనిసరిగా ఓటర్ సంతకం, తేదీతో పాటు బిఎల్ఒల సంతకం ఉండేలా చూసుకోవాలని సూచించారు.
• బిఎల్ఒలు ఓటర్లకు అందజేసిన రెండు ఎన్యూమరేషన్ ఫారాల్లో ఒకటి బిఎల్ఒలకు ఇవ్వాలని, మరొకటి ఓటర్ భద్రపరుచుకోవాలని పేర్కొన్నారు.
• పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఒలకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదు అవుతుందని స్పష్టం చేశారు.
• 2002 ఓటరు జాబితాలో ఓటర్ వివరాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నింపాలని, ఒకవేళ అటువంటి వివరాలను లేకపోయిన ప్రస్తుత వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బిఎల్ఒలకు అందజేయాలన్నారు.
• రాష్ట్రంలోని మొత్తం3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటివరకు 1,66,70,610 మంది (49.28%) ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సమర్పించారు.
• సర్ ప్రక్రియ జూన్ 25.06.2026 నాడు ప్రారంభమైందని, మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని, ఓటర్లు పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఈరోజే బిఎల్ఒలకు అందజేయాలని సూచించారు.