రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్ల బృందం సోమవారం నార్కట్పల్లి మండలం మాధవఎడవల్లి గ్రామానికి చేరుకుంది. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి బృందం సభ్యులకు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. బృందంలో సభ్యులుగా ఉన్న ఆరుగురు ఐఏఎస్లు వారం రోజలపాటు గ్రామంలో పర్యటిస్తారు. రోజుకో అంశంపై పరిశీలించి అధికారులతో సమాచారం తెలుసుకుంటారు. గ్రామంలో ఉన్నటువంటి వనరులు వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమవుతారు. గ్రామీణ జీవన విధానాలు, ఆర్థిక విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఈ బృందంలో ఆనంద్ మోహన్ మిశ్రా, రాజశేఖర్ పెట్ల, రాకేశ్ సేపట్, నిఖిల్ బి, ఆర్పిట్ విజయ వర్గియ, వివేక్ కుమార్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాంబశివావు, తాసిల్దార్ రాధ, సర్పంచ్ నరేందర్ రెడ్డి , ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.