
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను బలిగొన్నది. దీనికి ఇప్పటి వరకు కూడా మందు కనిపెట్టలేదు. దీంతో వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. భారత్ లో కూడా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో వైరస్ ప్రబలుతుండడంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.
కరోనా వైరస్ లక్షణాలు
– జ్వరం,అలసట, దగ్గు, జలుబు, ఆరోగ్యంగా లేనట్లు అనిపించడం.
– శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం.
– గొంతులో నొప్పి, అతిసారం, వాంతులు వంటి లక్షణాలు 20శాతం కేసులలో కనిపిస్తాయి.
– ఈ వైరస్ సోకితే శ్వాస వ్యవస్థ మొత్తం నిర్వీర్యమవుతుంది.వ్యాధి వ్యాప్తి ప్రభావం
– ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది అంటు వ్యాధి.
– వ్యాధి వచ్చిన వ్యక్తి, తుమ్మినా, దగ్గినా అతని నుంచి వైరస్ సోకుతుంది.
– వైరస్ సోకిన వారిని తాకినా, చేయి చేయి కలిపినా వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
– రోగి వాడిన వస్తువుల్ని తాకినా ఆ వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
– రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– ప్రతి మనిషి పరిశుభ్రతను పాటించాలి. చుట్టు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి.
– సబ్బుతో చేతులను ఎప్పుడూ కడుక్కుంటూ ఉండాలి.
– దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు ముక్కును, నోటిని టవల్ తో కవర్ చేయాలి.
– జ్వరం ఉన్నవారు ఉపయోగించే వస్తువులు, దుస్తులు వాడవద్దు.
– చేతులు కడుక్కున్న తర్వాత ముక్కు, కళ్లను నోటితో తాకరాదు.
– జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
– వ్యాధి సోకిన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.