రాష్ట్రంలో ఎల్ నీనో పరిస్థితుల ప్రభావంపై సమగ్రంగా విశ్లేషించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక రిపోర్ట్ ను నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణ, హార్టికల్చర్ కమిషనర్ యాస్మిన్ బాషాలకు అందజేశారు. ఈ సందర్భంగా నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలను చిన్నారెడ్డి వారికి వివరించారు. ఈ నివేదికలో చేసిన సిఫార్సులను ఆయా శాఖల వారీగా పగడ్బందీగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వారిని చిన్నారెడ్డి కోరారు. నిపుణుల కమిటీ రూపొందించిన రిపోర్ట్ ను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డి అందజేసిన విషయం తెలిసిందే.
