ఉద్యమ స్ఫూర్తికి చిరునామా జయశంకర్‌ సార్‌ : సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సమాజం ప్రొఫెసర్‌ జయశంకర్‌ను ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని తెలిపారు. తెలంగాణ సాధనకు చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జయశంకర్‌ సార్‌ అని కొనియాడారు. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, వివక్షను గణాంకాలుఉ సహా దేశానికి వివరించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన ఘనత ఆయనకే దకుతుందని ప్రశంసించారు. ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, దిశానిర్దేశం ఎప్పటికీ చిరస్మరణీయమ ని పేర్కొన్నారు. జయశంకర్‌ సార్‌ ఆశయాల సాధనకు ప్రభుత్వం పూ ర్తిగా కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు.