
ఆకాశవాణిలో న్యూస్ రీడర్ పనిచేసిన మాడపాటి సత్యవతి (80) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున 2గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు నాలుగు దశాద్దాల పాటు సత్యవతి తన స్వరంతో రేడియోలో వార్తలు చదువుతూ ఎంతో మంది శ్రోతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. సత్యవతి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె సేవలను సిఎం గర్తుచేసుకున్న సిఎం ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థించారు. సత్యవతి కుటుంబసభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.