- రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ (MoHUA) కార్యదర్శి కటికితాల శ్రీనివాస్, కేంద్ర రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్ లను తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయా సమావేశాల్లో చర్చించారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కటికితాల శ్రీనివాస్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ మౌలిక వసతులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, రహదారి అనుసంధానం, జాతీయ రహదారులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు సాగేందుకు ఈ సమావేశాలు దోహదపడనున్నాయి.