కొండా సురేఖను రాజీనామా చేయాలని ఆదేశించిన అధిష్ఠానం.. పార్టీని వీడే యోచ‌న‌లో మంత్రి..?

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా దంప‌తులు నేడు హైద‌రాబాద్‌లో త‌న అనుచచ‌రుల‌తో స‌మావేశ‌మైన భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపిన కొన్ని గంట‌ల‌కే  సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హైక‌మాండ్ హెచ్చరించింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, చేయకపోతే బర్తరఫ్ చేయాల్సి వస్తుందని, అక్కడి వరకు తెచ్చుకోవద్దని సురేఖకు ఖర్గే సూచించిన‌ట్లు తెలిసింది. బర్తరఫ్ కంటే రాజీనామా చేయడమే మంచిదని మంత్రి నిర్ణయించుకున్నట్లు స‌మాచారం. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చేలోపే రాజీనామా చేసే అవకాశం ఉంది. కాగా, త‌న‌పై తీసుకునే చ‌ర్య‌ల‌పై పునరాలోచించాలని కోరినా కొండా సురేఖ కోరిన‌న‌ప్ప‌టికి హైకమాండ్ నుంచి ఎలాంటి ఊరట ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశాక పార్టీలో కొనసాగడం అవమానకరమని, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో మంత్రి ఉన్న‌ట్లు తెలిసింది.