‘కరోనా’పై మహేశ్ బాబు ట్వీట్

హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా (కోవిడ్ -19) వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ ప్రజలకు పలు సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కరోనాపై ఎలాంటి ఆందోళన చెందవద్దని సినీ నటుడు మహేశ్‌బాబు సూచించారు. ముందుగా జాగ్రత్తలు తీసుకోండి..భయపడొద్దు అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. కరోనా నుంచి కాపాడుకోవడానికి అభిమానులు, ప్రజలకు మహేశ్‌ బాబు కొన్ని సూచనలు చేశారు.