పబ్‌లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి..

బిగ్‌బాస్‌-3 విజేత, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి జరిగింది. నిన్న రాత్రి ఓ పబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్‌పై బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో రాహుల్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతడిని పబ్‌ యాజమాన్యం, స్నేహితులు చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, స్టార్‌ మా నిర్వహించే బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రాహుల్‌ సిప్లిగంజ్‌ పేరు ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది.