- మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న ప్రభుత్వ ప్రతినిధి బృందం
హైదరాబాద్ / జపాన్: జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌కు వెళ్లిన ఈ బృందంలో ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ & ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతినిధి బృందం ఆసియా క్రీడలను వీక్షించి, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను పరిశీలించింది. ప్రపంచ స్థాయి క్రీడా వసతులు, పోటీల నిర్వహణ విధానాలు, క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఈ పర్యటన ద్వారా లభించింది. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలను అధ్యయనం చేయడంలో ఈ పర్యటన దోహదపడనుంది.