PCB అవినీతి అధికారులను ACB పట్టుకోదా..? వీరి ఆదాయానికి మించిన ఆస్తులను ACB అధికారులు కూడా కనిపెట్టలేరా..?

  • దారితప్పిన తెలంగాణ PCBని దారిలో పెట్టే నాథుడే లేడా..?
  • తెలంగాణ PCBకి చైర్మన్ వచ్చి నెల రోజులు కావస్తున్న ఎవరు కలవకుండా అడ్డుపడుతున్నదెవరు..?
  • PCB చైర్మన్ వచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్న ప్రత్యేక Email, ప్రభుత్వ సెల్ నంబర్ ఇవ్వకుండా ఆపుతున్నదెవరు..?
  • PCBలో జరుగుతున్న విషయాలను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుతగులుతున్నది ఆ ఉన్నతాధికారేనా..? ఇలా ఎంతకాలం ఆపగలరు..?  
  • ఇంతకాలం PCB మెంబర్ సెక్రెటరీ (MS) పేరు చెప్పి చేసిన అవినీతి, అరాచకాలు సరిపోవడం లేదా..? ఇప్పుడు ఛైర్మన్ పేరును కూడా చెడగొట్టాలా..?  
  • ఇప్పుడు PCB ఛైర్మన్ ను కూడా పక్కదారి పట్టించాలని చూస్తున్న ఆ అవినీతి అధికారి ఎవరు..?
  • PCB చైర్మన్ ను కలవాలంటే ఎందుకు కలుస్తున్నామో అనే విషయం ముందే PA కు చెప్పాలా..? ఈ రూల్ PA పెట్టిందా.. లేక ఆ ఉన్నతాధికారి పెట్టారా..?  లేక ఇంకా ఎవరైనా పెట్టిందా..? ఈ విషయం ఛైర్మన్ కు తెలిసే జరుగుతుందా..? తెలియకుండా జరుగుతుందా..?
  • PCB కి ప్రత్యేక చైర్మన్ వస్తే రగిలిపోతున్న అధికారులు ఎవరు..?  
  • PCBకి చైర్మన్ వచ్చి వారం కాక ముందే తప్పుడు ప్రచారాలు ఎందుకు మొదలు పెట్టారు..? PCBలో చేస్తున్న తమ పెద్ద పెద్ద తప్పులను కప్పిపుచ్చుకోవడానికేనా..?
  • తెలంగాణ PCB కొంత మంది అవినీతి అధికారుల జాగీరా..?
  • తెలంగాణ PCBపై ఆ కొంత మంది అవినీతి అధికారుల గుత్తాధిపత్యం ఎందుకు..?
  • ఆ ఉన్నతాధికారికి నచ్చితే అందలం.. లేదంటే పాతాళమేనా..?
  • తన చుట్టూ తనకు నచ్చిన వారినే పెట్టుకొని ఎంతకాలం భజన చేయించుకుంటూ మత్తులో ఉంటారు..?
  • తెలంగాణ PCBకి ఇంకో ఇద్దరు CEE లు, ఒక CES, మరో ఇద్దరు JCES లు, 3 ZO లు, 5 RO లు, మరింత మంది అధికారులు కావల్సి ఉన్నా, ఇలాంటి విషయాలను ఆ ఉన్నతాధికారి ఎందుకు పట్టించుకోవడం లేదు..?
  • మరో ఇద్దరు CEE లు వస్తే ఆ ఉన్నతాధికారి యొక్క ఏకఛత్రాధిపత్యం మరియు అతని అవినీతి, అరాచక సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని భయమా..?
  • PCBని మరింత మంది అధికారులతో విస్తరించి తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆ ఉన్నతాధికారికి అసలు ఇష్టం లేదా..?
  • PCB ని రెండు వర్గాలుగా విభజించి పాలిస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • అక్కడ ఒక మాట.. ఇక్కడ ఒక మాట.. చెప్పి ఎప్పుడో రావాల్సిన ప్రమోషన్లను ఆపుతూ.. తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • తనకు నచ్చని PCB అధికారులపై తప్పుడు ప్రచారాలు చేపించి.. వాటిని అడ్డుపెట్టుకొని RO EE లుగా ఉన్న అధికారులను, ఇతర అధికారులను తప్పించి.. తనకు నచ్చిన వారికి పోస్టింగ్ లు ఇస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..? 
  • ఇంతకాలం MS (మెంబర్ సెక్రెటరీ)ని పక్కదారి పట్టించి దండుకున్న అవినీతి సొమ్ము చాలదన్నట్లు, ఇప్పుడు ఛైర్మన్ ను కూడా దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • MS (మెంబర్ సెక్రెటరీ) పేరు చెప్పి.. MS కు తెలియకుండా బయట నడిపిన తతంగం చాలదా..?
  • తెలంగాణలో పర్యావరణం బాగుపడటం కొంత మంది PCB అవినీతి అధికారులకు ఇష్టం లేదా..?
  • వారి తప్పులను ప్రశ్నిస్తే భరించలేకపోతున్న ఆ కొంత మంది అవినీతి అధికారులు ఎవరు..?
  • PCB ఏమైనా ఆ కొంత మంది అవినీతి అధికారుల అత్తగారి ఇళ్లా..?
  • అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్మును చూసుకొని కాలుష్య బాధితులు, జర్నలిస్టులు, పర్యావరణ వేత్తలు, మేధావులపై అడ్డగోలుగా మాటలు జారుతున్న ఆ అవినీతి అధికారులు ఎవరు..?
  • ACB, విజిలెన్స్ లో కూడా మాకు తెలిసిన వారు ఉన్నారని చెప్పుకుంటున్న ఆ కొంత మంది PCB అవినీతి అధికారులు ఎవరు..?
  • ACB, విజిలెన్స్ అధికారులు అంటే కూడా ఆ కొంత మంది PCB అవినీతి అధికారులకు భయం లేకుండా పోతుందా..?
  • ఇన్వెస్ట్ గేషన్ సంస్థలంటేనే భయం లేదంటే.. ఇంకెవరికి భయపడతారు..?
  • మమ్మల్ని ప్రశించే వారిపై (కాలుష్య బాధితులు, జర్నలిస్టులు, పర్యావరణ వేత్తలు, మేధావులపై) అవినీతి సొమ్ముతో దాడులు కూడా చేపిస్తాం అనే స్థాయికి దిగజారి మాటలు జారుతున్న ఆ అవినీతి అధికారులు ఎవరు..? ఇంతకు బరి తెగించడం వెనుక ఉన్నది ఆ అవినీతి ఉన్నతాధికారేనా..?
  • ఈ అవినీతి అధికారులను దారిలో పెట్టడానికి మన CM రేవంత్ రెడ్డి గారు రావాలా..?
  • ఇంతటి అహంకారానికి అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్మే కారణమా..?
  • తప్పును ఎత్తి చూపితే సరిదిద్దుకోక పోగా.. అడ్డగోలు మాటలు జారడం ఎందుకు..? “గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే.. భుజాలు తడుముకోవడం ఎందుకు..”?
  • అవినీతి సొమ్ముతో ఏదైనా చేస్తాం అనుకుంటే.. “తాడిని కొట్టే వాడు ఉంటే.. వాడి తల కొట్టే వాడు ఉంటాడు..” అన్న సంగతిని ఈ కొంత మంది అవినీతి PCB అధికారులు మర్చిపోతే ఎలా..?
  • ప్రస్తుత చైర్మన్ అయినా నిజాయితీ మరియు కష్టపడి పనిచేసే అధికారులను గుర్తించి వారికి తగ్గ పని ఇస్తారా..? ప్రమోషన్స్ విషయం ముందుకు వెళ్తుందా..? 
  • అడ్డు అదుపు లేకుండా అవినీతి చేస్తూ.. తెలంగాణలో పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పరిశ్రమల వారికి సపోర్ట్ చేస్తూ.. కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు, జర్నలిస్టులు, మేధావుల మీద మాటలు జారుతున్న ఆ కొంత మంది అవినీతి అధికారులు ఎవరు..?
  • అవినీతి అధికారుల అండతో రెచ్చిపోతున్న పారిశ్రామికవేత్తల ముక్కుకు కళ్ళెం వేసేది ఎవరు..?
  • తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న సంగతి మర్చిపోయి.. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఏదైనా చేస్తాం అంటే ఎలా..?
  • తప్పు చేస్తే దారిలో పెట్టాల్సిన ఆ ఉన్నతాధికారులే దారి తప్పితే ఎలా..?
  • కొత్తగా PCBలోకి రాబోయే AEE, AS, మొదలగు అధికారులు వీరిని చూసి ఏం నేర్చుకోవాలి..?
  • విచ్చలవిడి అవినీతి చేస్తున్నా కూడా ఆ కొంత మంది AEEలనే అందలం ఎక్కించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి..?
  • మేం ఎవరినైనా ఏదైనా చేయగలం అనే అహంకారం వెనుక ఉన్న బలం అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముదేనా..?
  • ప్రభుత్వ ఉద్యోగంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ అధికారులకు ఉద్యోగం రాగానే అడ్డగోలు అవినీతి సొమ్ముతో అహంకారం పెరుగుతుందా..?
  • ఇలాంటి వారికి ACB అధికారుల దాడితో ఉద్యోగం ఊడితేనే స్పృహ వస్తుందా..?
  • త్వరలోనే ఆ కొంత మంది PCB అవినీతి అధికారుల కోటలు బద్దలు కానున్నాయా..?
  • పూర్తిగా మునిగిపోతున్న తెలంగాణ PCBని ఒడ్డుకు చేర్చే నాథుడే లేడా..?
  • ఆ కొంత మంది అవినీతి అధికారులకు జేబు సంస్థగా మారిన తెలంగాణ PCBకి ప్రస్తుత ఛైర్మన్ మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకువస్తాడా..? లేకపోతే ఆ అవినీతి ఉన్నతాధికారి అడ్డుతగులుతూనే ఉంటాడా..?  
  • పూర్తిగా తమ ఉద్యోగ బాధ్యతలను మరిచిపోయిన ఆ కొంత మంది PCB అవినీతి అధికారులకు వారి బాధ్యతలను గుర్తుచేస్తాడా..?
  • సమస్యల వలయంలో కూరుకుపోయిన తెలంగాణ PCBని కాపాడుతాడా..?
  • పూర్తిగా దారితప్పిన తెలంగాణ పరిశ్రమలను దారిలో పెడతాడా..?
  • అక్రమసంపాదనే ధ్యేయంగా బతుకుతున్న ఆ కొంత మంది అవినీతి అధికారుల భరతం పడతాడా..?
  • పనిరాకున్న అర్హతకు మించి అందలం ఎక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఉద్యోగ బాధ్యతలు మరిచిపోయిన ఆ కొంత మంది అవినీతి అధికారులను ఇంటికి పంపాల్సిందేనా..?
  • తెలంగాణ PCBని ఓ కుటుంబ సంస్థలా మార్చి.. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఆ కొంత మంది అవినీతి అధికారులకు ముందు ముందు కఠిన శిక్షలు తప్పవా..?
  • తమ ఉద్యోగ బాధ్యతలు పూర్తిగా మరిచి నిస్సిగ్గుగా PCB నాశనానికి, తెలంగాణలో పర్యావరణ వినాశనానికి  కారణం అవుతున్న ఆ కొంత మంది అవినీతి అధికారులకు రాబోయే రోజుల్లో న్యాయస్థానాల పరిధిలో శిక్ష తప్పదా..?
  • PCBలో డిప్యుటేషన్లకు అర్ధం లేకుండా చేస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • PCBలో ఎక్కువ శాతం ఎవరికి నచ్చిన విధంగా వారు నచ్చిన డిప్యుటేషన్లను ఇప్పించుకోవడానికి ఆ ఉన్నతాధికారి చేస్తున్న తప్పులే కారణమా..? ఆ ఉన్నతాధికారి వల్లే ట్రాన్స్ ఫర్లకు అర్ధం లేకుండా పోయిందా..?
  • PCBలోనే ఉన్నతమైన హోదాలో ఉన్న ఓ అధికారి భార్య గత కొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కావడం లేదని PCBలోని తోటి ఉద్యోగులు చెప్పడంలో నిజం లేదా..? దీనిపై విచారణకు సిద్దమా..?
  • ఆ ఉన్నతాధికారి బంధువుకు వరంగల్ జోనల్ ల్యాబ్ లో జాబ్ ఎలా వచ్చిందో విచారణకు సిద్ధమా..?
  • తెల్లాపూర్ లో కోట్ల ఖర్చుతో కడుతున్న విల్లా ఎవరిది..? శామీర్ పేట, కర్కపట్ల దగ్గరలో బినామీ పేరు మీద కడుతున్న డైరీ ఫాం ఎవరిదో..? ఏ ఉన్నతాధికారిదో తేల్చడానికి విచారణకు సిద్దామా..?
  • టాస్క్ ఫోర్స్, CFO, CFE, ZO HYD, ZO RC PURAM మరియు సంగారెడ్డి, RC పురం, హైదరాబాద్ లాంటి ROలలో జరుగుతున్న విచ్చలవిడి అవినీతి ఆరోపణలపై PCB ఛైర్మన్, ACB, విజిలెన్స్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్దమా..?
  • PCBలోని భార్యాభర్తల అవినీతి సామ్రాజ్యానికి, ఇష్టారాజ్యానికి చెక్ పడబోతుందా..?
  • భర్త కారణంగానే భార్యకు దొడ్డిదారిలో DPC పెట్టకుండానే EE గా ప్రమోషన్ వచ్చింది అంటున్న PCB అధికారుల మాటల్లో నిజం ఎంత..? దీనిపై విచారణకు సిద్దమేనా..?
  • దొడ్డిదారిలో ఉద్యోగంలో చేరి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్న ఆ కొంత మంది అవినీతి అధికారులకు చట్టం పరిధిలో శిక్ష పడాల్సిందేనా..?
  • కార్పొరేట్ ఆస్పత్రులకు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి లక్షలు దండుకున్న ఆ ఆవినీతి అధికారిపై FIR నమోదు అయిన సరే కాపాడిన ఆ ఉన్నతాధికారి ఎవరు..?
  • SC సర్టిఫికెట్స్ తో ప్రమోషన్ లు పొందుతూ.. క్రిస్టియన్ గా చలామణి అవుతున్న అవినీతి అధికారిపై విచారణకు సిద్ధమా..?
  • వనపర్తి Bus స్టాండ్ దగ్గరలో కట్టిన నాలుగు అంతస్తుల భవనంపైన విచారణకు సిద్ధమా..?
  • హైదరాబాద్ RO పరిధిలోని ఓ ప్రముఖ స్టీల్ పరిశ్రమ నుండి రూ.13 లక్షల స్టీల్ ఏ ఇంటి నిర్మాణానికి వెళ్ళిందో విచారణకు సిద్దమా..?
  • PCB ROలో ఓ మహిళా అధికారి..తనపై తన పైఅధికారి లైంగిక వేధింపులకు గురి చేశాడని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. అంత పెద్ద తప్పుచేసిన ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఆ మహిళా అధికారిపైనే ఒత్తిడి తెచ్చి.. మా మాట వినకపోతే భవిష్యత్ లో నువ్వు ఇబ్బందులు పడతావు మరియు ఉద్యోగం చేయలేవు అని బెదిరించి తనకు ఇష్టం లేకున్నా తనతో బలవంతంగా లెటర్ రాపించిన ఆ ఉన్నతాధికారి ఎవరు..? ఈ విషయంపై విచారణకు సిద్దమా..?
  • HYD ROలో AEE గా పనిచేస్తున్న ఓ అధికారి బహిరంగంగానే లంచం అడుగుతున్న ఆడియో టేప్ పై విచారణకు సిద్ధమా..?
  • PCB ఛైర్మన్ వచ్చి నెల రోజులు కావస్తున్న కాలుష్య బాధితులను, పర్యావరణ వేత్తలను, జర్నలిస్టులను, మేధావులను కలవకుండా అడ్డుపడుతున్న ఆ ఉన్నతాధికారిపై పోరాటం ఆపేదే లేదు..
  • PCBలో కొంత మంది అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ.. తనకు నచ్చిన వారిని మాత్రం నెత్తి మీద పెట్టుకున్న ఆ ఉన్నతాధికారి ఆగడాలపై పోరాటం ఆపేదే లేదు..
  • PCB చైర్మన్ మరియు మెంబర్ సెక్రటరీ (MS)లను తమ దారిలోకి తెచ్చుకొని ఇష్టారీతిన వ్యవహరించాలని ప్రయత్నం చేస్తున్న ఆ కొంత మంది అవినీతి ఉన్నతాధికారులకు చెక్ పెడతారా..?
  • కొత్త చైర్మన్ రాకతో PCBలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ మరియు అవినీతి నియంత్రణలో భారీ మార్పులు.. ఉంటాయా.. ఉండవా..? వేచి చూద్దాం..
  • కొత్తగూడెం RO అధికారి చేసిన అవినీతిని కప్పిపుచ్చుతూ కాపాడిన మాట వాస్తవం కాదా..? దీనిపై ACB  విచారణకు సిద్ధమా..? ఓ సంస్థ దగ్గర ఉన్న ఆడియో టేప్ లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నిజాన్ని నిగ్గు తేల్చడానికి సిద్దమా..?
  • కొత్తగూడెం RO అధికారి డైరెక్షన్ లో AES చేయాల్సిన పనిని ఓ క్రిందిస్థాయి ఉద్యోగితో హాస్పిటల్స్ ఇన్స్ పెక్షన్ చేపిస్తున్న మాట నిజం కాదా..? దీనిపై విచారణకు సిద్దమా..?
  • ప్రస్తుత JCESపై అవినీతి ఆరోపణలు, అక్రమాస్తులపై ACB విచారణకు సిద్ధమా..? ఈ మధ్యకాలంలోనే ఉప్పల్ భగాయత్ లో తీసుకున్న ప్లాట్ పై విచారణకు సిద్దమా..?
  • ఓ PCB అధికారి ఆ ఉన్నతాధికారిని బొల్లారంలో పని చేస్తున్న ఇంకో ప్రభుత్వ అధికారి అండదండలతో కాపాడుతా అని భరోసా ఇవ్వగానే ఒక్క రోజులోనే కోరుకున్న ROలో కూర్చోబెట్టడంపై విచారణకు సిద్ధమా..?
  • PCB Account సెక్షన్ లో కూడా ఈ ఉన్నతాధికారి చేపిస్తున్న అవినీతిపై నిజాయితీ కలిగిన AG అడిట్ అధికారులతో విచారణకు సిద్ధమా..?
  • ఆ ఉన్నతాధికారి తనకు నచ్చిన.. తను మెచ్చిన.. ఆ కొంత మంది అవినీతి అధికారుల అనుచరగణంతో కలిసి ఇవన్నీ చేస్తున్నాడని పలువురు PCB అధికారులే చెప్పడం విశేషం.. ఈ విషయాలు ఏవీ కూడా MS (మెంబర్ సెక్రటరీ)కి తెలియకుండా జాగ్రత్త పడుతూ MS పేరును బాగా వాడుతున్నాడని చెప్పడం మరో విశేషం..
  • ఆ కొంత మంది అవినీతి అధికారుల అరాచకాన్ని, అసాంఘిక కార్యకలపాలను అరికట్టి తెలంగాణ PCBని కాపాడుతారో.. లేదంటే PCBని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తారో..  ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చిందని కొందరు మేధావులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు..  
  • తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడటమే మా సంస్థల లక్ష్యం..అవినీతి అధికారులపై పోరాటం ఆపేది లేదు.. తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాజీపడేది లేదు..?
  • కాలుష్యం చేస్తున్న పరిశ్రమల నుండి భారీగా లంచాలు తీసుకున్నట్టు.. అవినీతి జరిగిందా లేదా అని  నిరూపించడానికి పలు సంస్థల నుండి మరియు కాలుష్య బాధిత గ్రామాల నుండి (జిన్నారం, గడ్డపోతారం, దోతిగూడెం, అంతమ్మగూడెం, జడ్చర్ల సెజ్, సంగారెడ్డి, పటాన్ చెరువు, IDA బొల్లారం మొదలగు ప్రాంతాల నుండి) పలువురు ప్రతినిధులు ప్రజల సమక్షంలో PCB ప్రధాన కార్యాలయంలోనే నిజాయితీపరులైన అధికారులతో విచారణకు సిద్దమా..?  
  • తెలంగాణ వచ్చిన దగ్గర నుండి PCBలో జరుగుతున్న అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, అరాచకాలపై చర్చకు, విచారణకు మరియు శిక్షకు సిద్దమా..?
  • దీనికి మీరు సిద్దంగా లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గానీ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గానీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలంగాణ సమాజానికి.. CM రేవంత్ రెడ్డి గారికి.. ప్రభుత్వానికి తెలిసేలా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు సోషల్ మీడియా జర్నలిస్టుల ద్వారా పూర్తి వివరాలు తెలియజేస్తాం.. అంతే కాకుండా మా దగ్గర ఉన్న ఆధారాలతో హైకోర్టులో.. HRCలో.. ACB, విజిలెన్స్ లాంటి సంస్థలకు పూర్తి ఆధారాలను అందజేసి.. న్యాయ విచారణకు కోరుతాం..   
  •  చిన్న చిన్న అవినీతి అధికారులను పట్టుకుంటున్న ACB అధికారులు PCBలో ఉన్న భారీ అవినీతి తిమింగలాలను ఎందుకు పట్టుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్న పలువురు పారిశ్రామిక వేత్తలు, కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు..!
  • తెలంగాణ PCBలో జరుగుతున్న అవినీతి, అసాంఘిక కార్యకలపాలు, అరాచకాలు, కొందరు అధికారులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటంలో భాగంగా 5 లక్షల కరపత్రాలు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా పంపిణీకి సిద్ధమవుతున్న పలు పర్యావరణ సంస్థలు. టాస్క్ ఫోర్స్, CFO, CFE, జోనల్ ల్యాబ్ లలో అవినీతి ఎలా జరుగుతుందో.. కన్సల్ టెంట్స్ మాటున జరుగుతున్న అవినీతి, ఫైలుకో రేటు.. పనికో బేరం..! పై PCBకి సంబంధించిన మరింత సమాచారం పూర్తి ఆధారాలతో త్వరలో..