
CMSTEI పథకం క్రింద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ శిక్షణ పొందిన, 50 మంధి గిరిజన ఔత్సహిక పారిశ్రామిక వేత్తల తో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రములో డా. క్రిస్టినా జెడ్ చొంగ్త్, సెక్రెటరి మరియు కమిషనర్, గిరిజన సంక్షేమ శాఖ మాట్లాడుతూ ప్రతి గిరిజన ఔచ్చహిక పారిశ్రామిక వేత్త మంచి వ్యాపారాన్ని ఎంచుకోవాలని మార్కెట్ డిమాండ్ ఆదారంగా వ్యాపార ప్రదేశాని ఎంచుకోవాలని అదే విదంగా వ్యాపార ప్రతిపాదనలు ఆమోదించే ముందు బ్యాంక్ మరియు గిరిజన సంక్షేమ అదికారులు తనీఖి చేస్తారని, తనీఖి తర్వాత బ్యాంక్ లోన్ మంజురి చేస్తారని, తదనంతరం వ్యాపార ప్రణాళికలు మరియు బ్యాంక్ లోన్ మంజురి పత్రాలు రాష్ట్ర స్థాయి ఉన్నత కమిటికి సమర్పించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి ఉన్నత కమిటి క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత సబ్సిడీ మంజూరు అవుతుంది, కావున ప్రతి స్థాయిలో చాలా అప్రమత్తంగా ఉండాలని అదే విదంగా సుస్థిత వ్యాపారాన్ని ఎంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు 15 రోజుల లోపు తమ వ్యాపార ప్రణాళికలు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) వారికి సమర్పించాలని తెలియజేశారు.ఈ కార్యక్రములో శంకర్ రావు, డిజిఎం, ట్రెకార్, యం లక్ష్మి ప్రసాద్, ఎస్‌ఎంఎం, ట్రెకార్, బాల్ భీమ్ వ్యెద్య, ఏజిఎం, ఎస్‌బిఐ మరియు అమృత దత్తా సీనియర్ డైరెక్టర్, సిఐఈ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పాల్గొన్నారు.