బాధితుడి నుంచి రూ.3 లక్షల నగదు తీసుకున్న విషయంలో సీఐ, హోంగార్డు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్ కొండర్‌రావును ఓ కేసులో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఒక వ్యక్తి సంప్రదించాడు. అందుకోసం ఇన్‌స్పెక్టర్ కొండల్‌రావు రూ.6 లక్షలు డిమాండ్ చేశాడు. ఇన్‌స్పెక్టర్ కొండల్‌రావు నేరుగా డబ్బు తీసుకోకుండా హోంగార్డును మధ్యవర్తిగా పెట్టి మూడు లక్షల నగదు తీసుకున్నాడు. ఏసీపీ అధికారులు వలపన్ని హోంగార్డును అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.