రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడు తున్నారు. తాజాగా గురువారం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పాలనాధికారి శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్గా చిక్కారు. మొసం గ్రామంలో రెవెన్యూ రికార్డులలో తండ్రి పేరును సరిదిద్ది , ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించాలని , అదేవిధంగా ఫిర్యాదుదారుడు , అతని సోదరుడు వ్యవసాయ భూమికి సంబంధించి వారసత్వ హక్కులను పొందేలా చేయాలని కోరుతూ జీపీవోను సంప్రదించాడు. అయితే లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా గురువారం జీపీవో శ్రీనివాస్ రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా జీపీవోకు రిమాండ్ విధించారని ఏసీబీ అధికారులు వెల్లడించారు.