
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ధి చెందుతుంది. మహిళలకు యావత్ సమాజం అండగా నిలవాలి అని సీఎం అన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించి పురోగమించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.