
‘‘మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’’నంటూ మణిపూర్‌కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలకు తన సామాజిక మాధ్యమ ఖాతాలను అప్పగిస్తానని మోదీ ఇటీవల పేర్కొన్నారు.
మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నానని మణిపూర్‌కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలకు తన సామాజిక మాధ్యమ ఖాతాలను అప్పగిస్తానని మోదీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘షీఇన్‌స్పైర్స్‌అజ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. ఏనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. దీనిపై లిసిప్రియా స్పందించింది. ‘ప్రియమైన నరేంద్ర మోదీజీ, స్ఫూర్తిదాయక మహిళల్లో ఒకరిగా నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. పర్యావరణ పరిరక్షణలో నా గోడును పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ గౌరవాన్ని నిరాకరిస్తున్నా. జైహింద్’ అంటూ ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.