
గత కొద్ది సంవత్సరాలుగా తన రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వివరణ ఇచ్చారు రజనీకాంత్. రజిని మక్కల్ మండ్రమ్ (ఆర్ఎంఎం) పేరుతో కొన్నాళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు తలైవా. అయితే తాజాగా ఆయన చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతవారం నేను ఆర్ఎంఎం నిర్వాహకులతో సమావేశమయ్యాను. ఓ విషయంలో అసంతృప్తిగా ఉన్నానని చెప్పాను. దీంతో ఈ విషయం గురించి ఊహాగానాలు ఎక్కువయ్యాయి. దీనిపై క్లారిటీ ఇవ్వడానికే ఈ రోజు ఇక్కడికి వచ్చాను.
నేను రాజకీయాలలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నారు. 15 ఏళ్ళుగా నా రాజకీయ ప్రవేశంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. 2017లో నా రాజకీయ ప్రవేశంపై వివరణ ఇచ్చాను. తమిళనాడు పరిస్థితులని విశ్లేషించడం మొదలు పెట్టాను. ప్రజల మనస్తత్వం మారాల్సిన అవసరం ఎంతైన ఉంది. రాజకీయ నాయకులకి ప్రజలంటే కేవలం ఓట్లే. అత్యధిక మంది నా పార్టీలో భాగస్వాములు అయ్యేలా చూసుకుంటాను. వనరుల దుర్వినియోగం నా పార్టీలో ఉండదు. సమయానికి తగ్గట్టు పరిపాలన సాగట్లేదు. జయలలిత మరణం తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడింది. యువరక్తం రాజకీయాలలోకి రావాలి. ప్రభుత్వం, పార్టీలపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదు. నాకు 3 ప్రణాళికలు ఉన్నాయి. నిజాయితీపరులకే సీఎం స్థానం దక్కాలి. నేను పార్టీ అధ్యక్షుడిగానే ఉంటా. నా పార్టీలో 65 శాతం యువకులకి అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఐఏస్, ఐపీఎస్‌లని పార్టీలలోకి ఆహ్వానిస్తాను. అన్నీ పార్టీలలో 50 ఏళ్ళకి పైబడిన వారే ఉన్నారు. యువతకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు తలైవా.