ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా – విజయనగరం జిల్లా పీసీబీ ఈఈ టి.సుదర్శనం

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ప్రాంతీయ కార్యాలయ అధికారులు విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ షెడ్యూల్ వాయిదా వేశారు. ఈ మేరకు పీసీబీ ఈఈ టి. సుదర్శనం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న పరిశ్రమల నిర్మాణాలపై ఈ నెల 12, 13,,19, 20వ తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉందని ఇటీవల ప్రకటించామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని తదుపరి షెడ్యూల్ తేదీలను తరువాత ప్రకటిస్తామని తెలిపారు.