
స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం భారీ నష్ర్టాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిమాణాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి. అమెరికా – యూరప్ దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 3100 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్, 900 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 30వేల మార్కు దిగువన ట్రేడ్ అవుతోంది. 9వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ ట్రేడవుతోంది.