
కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజల సహకారం అవసరమని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన సినిమా షూటింగ్‌లను తక్షణం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా  ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. దీనిపై మరింత అప్రమత్తత అవసరం కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ద్విముఖ వ్యూహం బాగుందని తెలిపారు.  కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా క్రీడల్ని వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్ ని మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడం తదితర చర్యలు తీసుకోవడం ప్రజల ఆరోగ్య పరంగా మంచిదన్నారు.  
పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాను. సినిమా షూటింగ్స్ లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదా వేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న నా సినిమా షూటింగ్‌ని వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు. ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్ ని నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.