నగర ప్రజల సహకారం భేష్ – పోలీస్ కమిషనర్ అంజనీకుమార్

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను నగర ప్రజలు పాటించారని, ముందు కూడా సహకారం అవసరమని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాటిని పరిశిలించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నగర ప్రజలను అభినందించారు. ఆంక్షలను నగర ప్రజలు తూచాతప్పకుండా పాటిస్తున్నారని తెలిపారు. ఆంక్షలు కొంత ఇబ్బందికరంగా ఉన్నా నగరంలోని ప్రతి ఒక్కరి క్షేమం కోసం తప్పదని తెలిపారు. వివాహా శుభకార్యాల్లో 200మంది కంటే మించకూడదని, తక్కువ మందితో శుభకార్యాలు చేసుకోవాలని కోరారు.