
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టివేసింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో అభ్యంతరాలు ఉంటే కేంద్రాన్ని సంప్రదించవచ్చని క్యాట్ సూచించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏపీ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావును సప్పెండ్ చేసింది.