
నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కవిత ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెస్తారంటూ సంతోష్ కుమార్ కొనియాడారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా కవిత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య కవిత తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు గడువు రేపటితో ముగియనుంది. ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కవిత కలిశారు. కవితతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు.