
అన్ని రకాల ఔట్ పేషెంట్ విభాగాల సేవలను రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎయిమ్స్ ఈ నిర్ణయం వెలువరించింది. రేపటి నుంచి ఎయిమ్స్ అన్ని విభాగాలలో ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎయిమ్స్ అన్ని కేంద్రాల్లో ఈ ఉత్తర్వులు కొనసాగుతాయంది. అదేవిధంగా బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన సర్ సుందర్‌లాల్ ఆస్పత్రి సైతం ఓపీడీ సేవలను నిన్నటి నుంచే బంద్ చేసింది.