
ప్రభుత్వం జారీచేసిన జీఓ-45,46ప్రకారం హైదరాబాద్ ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీసులు లాక్‌డౌన్ పాటించని వాహనదారులు, ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ 25 ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల పరిథిలో 73చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి సోమవారం మొత్తం 2480వాహనాలను సీజ్‌చేశారు. ట్రాఫిక్ విభాగం అదనపు పోలిస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం లాక్‌డౌన్ పాటించని 1058ద్విచక్ర వాహనాలు, 948 ఆటోలు, 429కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు, 45ఇతర వాహనాలు కలిపి మొత్తం 2480వాహనాలను సీజ్‌చేశారు.
ఏమైనా ఫిర్యాదులంటే కంట్రోల్ రూమ్ నెంబరు 040-27852482కు, లేక హెల్ప్‌లైన్ నెంబరు- 9010203626కు ఫోన్‌చేయాలని ఆయన కోరారు. రాత్రి ఏడు గంటలనుంచి ఉదయం ఆరు గంటల వరకు ఏ వాహనం బయట తిరగరాదని స్పష్టంచేశారు. నగరాన్ని కరోనా ఫ్రీ నగరంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. రాత్రి వేళల్లో ఏ ఒక్క వాహనం, ఒక్కరు కూడా రోడ్లపైకి రావద్దని సూచించారు. బైక్‌లు, కార్లు, ఆటోలు ఎవైనా సరే సీజ్ చేస్తామని హెచ్ఛరించారు.