
రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ అపర్ణ లేక్ బ్రీజ్ టవర్స్ లో నివాసముండే 39ఏండ్ల మహిళ ఈ నెల 12న జర్మనీ నుంచి నగరానికి వచ్చింది. హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ఆ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం చందానగర్ సర్కిల్ కోవిడ్-19 బృందం ఆమెను గాంధీ దవాఖానకి తరలించి కరోనా నిర్ధారణ పరీక్ష చేశారు.
తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకు సైతం గాంధీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల లండన్ నుంచి వచ్చిన కూకట్‌పల్లికి వచ్చిన 49ఏండ్ల వ్యక్తికి, బేగంపేటకు చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బేగంపేటకు చెందిన మహిళ సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.