
శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది పండుగని తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి భయపెట్టిస్తున్నప్పటికీ, దేవాలయాలకి వెళ్ళకుండా ఇంట్లోనే పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారాను పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్కరికి ఎంతో ప్రత్యేకం కావాలని భావిస్తున్నారు .
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా పేజ్ ద్వారా మోదీ తెలుగులో విషెస్ చెప్పడం విశేషం. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది.ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు మోదీ. గత రాత్రి జాతినుద్దేశించి మాట్లాడిన మోదీ, 21 రోజులు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందని ప్రకటించిన విషయం విదితమే.