
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వీరిలో ఒకరు విదేశాల నుంచి వ్యక్తి అన్నారు. ఈ ఐదుగురితో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరుకుంది. స్థానికంగా ఉండే కాలనీల్లో దుకాణాలకు వేళ్లేందుకు ప్రజలకు ఎటువంటి కర్ఫ్యూ పాసులు అవసరం లేదన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే దుకాణాల్లో అవసరమైన మందులను, పాలను, కురగాయాలను కొనుగోలు చేయొచ్చన్నారు.