21 రోజుల్లో కరోనాపై విజయం సాధిద్దాం: ప్రధాని మోదీ

భారతీయులంతా ఇళ్లలోనే ఉండి 21 రోజుల్లో కరోనా మహమ్మారిపై పోరాటం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. వారణాసి ప్రజలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మనమంతా కరోనా వైరస్‌ పై యుద్దం చేస్తున్నాం. సామాజిక దూరం ప్రజలకు అలవాటుగా మారాలని ప్రధాని సూచించారు.
వారణాసి ప్రజలు కరోనాను జయించడంలో దేశానికి స్పూర్తిగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం వాట్సాప్‌తో భాగస్వామ్యమై కరోనా గురించి సమాచారం అందించేందుకు హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. మీరు 9013151515ను యాడ్‌ చేసుకుని..కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని ప్రధాని మోదీ తెలిపారు.