
విదేశాల నుంచి ఇప్పటివరకు రాష్ర్టానికి వచ్చిన వారి వివరాలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తిచేయాలన్నారు. వారితో పాటు ఎవరెవరిని కలిశారో అందరి సమాచారం సేకరించాలన్నారు. వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సర్వే చేయాలన్నారు. సర్వేకు ప్రజలంతా సహకరించాల్సిందిగా కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవారేరన్నారు. వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం, వైద్యారోగ్య సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు విధిగా హోం క్వారంటైన్‌ను పాటించాలని పేర్కొన్నారు.