
నల్లకుంటలోని ఫీవర్ దవాఖానలో బుధవారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ట్రయల్ కింద 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం ఐసోలేటెడ్ వార్డు మాత్రమే ఉండేది. కరోనా అనుమానితులను మాత్రమే ఈ వార్డులో పెట్టి వారి నుంచి సేకరించిన శాంపిళ్లను గాంధీ, ఉస్మానియా దవాఖానలకు పంపించి పరీక్షలు నిర్వహించేవారు. అక్కడ నుంచి రిపోర్టులు వచ్చిన తరువాత పేషంటుకు అసలైన చికిత్స మొదలుపెట్టేవారు. పాజిటివ్ వస్తే ఎర్రగడ్డలోని ఛాతి వైద్యశాలకు పంపించేవారు. కానీ బుధవారం నుంచి ఇక్కడే పరీక్షలు మొదలయ్యాయని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు.