
కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఇసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ వరకు, ఇసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీతో, ఇసెట్ దరఖాస్తు గడువు 28వ తేదీతో ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో గడువును పొడిగించారు.