రెండు కోట్ల విరాళం ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వలన ఇంటికే పరిమితమై పూట గడవలేని పరిస్థితులలో ఉన్న వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు, వినాయక్ రూ.5లక్షల విరాళాలు ప్రకటించగా, తాజాగా పవన్‌ రూ.2 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50లక్షల ఇస్తానన్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ప్రధానమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయల ఆర్ధిక సాయం చేయబోతున్నట్టు కూడా తెలియజేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం రూ. 10లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.