
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల్ని విరాళంగా అందజేశారు చిరంజీవి. కరోనా వైరస్ కారణంగా దినసరి వేతన కార్మికులు, అల్పదాయ వర్గాల వారు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చిరంజీవి తెలిపారు. తెలుగు చిత్రసీమలోని సినీ కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఆదుకోవడం కోసం కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.