నిత్యావసర సరుకుల ధరలు ఖరారు.. పెంచితే పీడి యాక్ట్

అత్యవసర సేవలు తప్పితే అన్నీ బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వారాల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యం లోనే కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను పెంచి అమ్ముతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం నిత్యావసర ధరలను కట్టడి చేసేందుకు వాటి ధరలను నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా ఆ ధరల కంటే అధికంగా అమ్మితే పిడి యాక్ట్ కింద కేసులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కూరగాయలు
వంకాయ- రూ.30, కేజీబెండకాయ- రూ.40, కేజీటమాట- రూ.10, కేజీఅరటికాయ- రూ.40, కేజీకాలిఫ్లవర్- రూ.40, కేజీక్యాబేజి- రూ.23, కేజీపచ్చిమిర్చి- రూ.60, కేజీచిక్కుడుకాయ- రూ.45, కేజీబీరకాయ- రూ.60, కేజీక్యారెట్- రూ.60, కేజీఆలుగడ్డ- రూ.30, కేజీఉల్లిపాయలు(తెల్లవి)- రూ.30, కేజీఉల్లి(ఎర్రవి)- రూ.35, కేజీవెల్లుల్లి- రూ.160, కేజీఅల్లం- రూ.220, కేజీ
ఆకు కూరలుపాలకూర- కిలో రూ.40, తోటకూర- కిలో రూ.40, కొత్తిమీర- కిలో రూ.60, మెంతీకూర- కిలో రూ.60,
నిత్యావసర వస్తువులు
కందిపప్పు (గ్రేడ్1)- కిలో రూ.95, మినపపప్పు కిలో రూ.140, పెసరపప్పు- కిలో రూ.105, శనగపప్పు- కిలో రూ.65, సజ్జలు- కిలో రూ.30, గోధుమలు- కిలో రూ.36, జొన్నలు- కిలో రూ.38, రాగులు- కిలో రూ.40