
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు సంఖ్య 5లక్షలు దాటింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 22, 334 మంది మృతిచెందారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 1, 21, 214 మంది కోలుకున్నారు. అటు ఇటలీ, స్పెయిన్, అమెరికాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా అమెరికాలో కరోనా నివారణకు భారీ బడ్జెట్ కేటాయించింది. రూ. 1,500 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించిన బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. దీనికి ప్రజాప్రతినిధుల సభ ఆమోదం ఆమోదం తెలిపి..ట్రంప్ సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది. కాగా ఈ నిధులను మొత్తం కూడా ఆస్పత్రుల నిర్మాణం, ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు వినియోగించనున్నారు. అటు భారత్ కూడా కరోనా నివారణకు రూ 1.70లక్షల కోట్లు కేటాయించింది.