
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 27,250 మంది ప్రాణాలు కోల్పోగా, 5.94 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 1.33 లక్షలు. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 9,134కు చేరగా, స్పెయిన్‌లో 5,138 మంది మృతి చెందారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 18 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు 1477 మంది మృతి చెందారు. అమెరికాలోని సగం మంది బాధితులు న్యూయార్క్ ప్రాంతానికి చెందిన వారే.
జర్మనీలో 50,871 కేసులు నమోదు కాగా, 351 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో 32,964 కేసులు(మృతులు 1,995), ఇరాన్‌లో 32,332 కేసులు(మృతులు 2,378), యూకేలో 14,543 కేసులు(మృతులు 759), స్విట్జర్లాండ్‌లో 12,928(మృతులు 231), దక్షిణ కొరియాలో 9,748 కేసులు(మృతులు 144), నెదర్లాండ్స్‌లో 8,603 కేసులు(మృతులు 546) నమోదు అయ్యాయి.