
కరోనా విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో కోట్లాది మంది ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ తరుణంలో తగు చర్యలు చేపట్టాయి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు. ఇప్పటికే పలు వరాలు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు తాజాగా విద్యుత్ బిల్లులకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే మూడు నెలలు విద్యుత్ బిల్లులు చెల్లించడంలో ఆలస్యమైన ఫెనాల్టీని మినహయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీలకు కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ ఇవాళ స్పష్టమైన మార్గదర్శకాలు జారిచేయనుంంది.