
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడు అండగా నిలిచే అక్షయ్ కుమార్..తాజా విపత్కర పరిస్థితులలో రూ. 25 కోట్ల రూపాయలని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రజల జీవితాలని కాపాడుకోవలసిన సమయం వచ్చింది. ఈ సమయంలో మనకి తోచినంత సాయం చేయాలి అని అక్షయ్ అన్నారు. పీఎం కేర్స్ ఫండ్‌కి అక్షయ్ రూ.25 కోట్ల విరాళాన్ని అందించారు. అక్షయ్ సాయాన్ని అభినందిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ .. భారతదేశాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం విరాళాలు ఇద్ధాం అని అన్నారు. కరోనా వలన దేశంలో ఇప్పటికే 20 మంది మృతి చెందగా, 900కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన విషయం విదితమే.