కరోనా వైరస్‌కు సంబంధించిన సందేహాలను నివృతి చేసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లను కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి సందేహాలున్నా ఆయా హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో దాని వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అయితే ఉపాధికోసం నగరాలకు వలస వచ్చినవారు తమ సొంతూర్లకు కాలినడకన ప్రయాణమయ్యారు. దీన్ని నివారించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 873 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 19 మంది మరణించారు. గత 24 గంటల్లో సుమారు 149 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.