ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు

ఏపీలో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. క‌ర్నూలు జిల్లా సంజామ‌ల మండ‌లం నొసంలో రాజ‌స్థాన్ కు చెందిన ఓ యువ‌కుడికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో న‌మూనాల‌ను ప‌రిశీలించ‌గా క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో నొసంలో మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కూ క‌రోనా జోన్‌గా జిల్లా క‌లెక్ట‌ర్ వీర‌పాండ్య‌న్ ప్ర‌క‌టించారు. దీంతో పాటు 7 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ క‌రోనా బ‌ఫ‌ర్ జోన్‌గా ఉంచుతున్న‌ట్లు తెలిపారు. తాజా కేసుతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 14కి చేరింది.