ఏపీలో మ‌రో రెండు పాజిటివ్ కేసులు

ఏపీలోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుంది. ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన‌ ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. వారిద్ద‌రూ కూడా భార్య‌భ‌ర్త‌లు. వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చిక్సిత్స అందిస్తున్నారు. కాగా ఇటీవ‌లే వారు ఢిల్లీ వెళ్లివ‌చ్చారు. అంత‌కుముందు క‌ర్నూలు జిల్లాలో రాజస్థాన్ యువ‌కుడికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఏపీలో ఇవ్వాళ ఒక్క‌రోజే మూడు పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఏపీలో క‌రోనా బాధితుల సంఖ్య 16కు చేరింది.