
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆదివారం నాటికి అధికారికంగా 31,412 మందిని బలితీసుకుంది. మొత్తం 667,090 మంది దీని కోరల్లో చిక్కుకుని బాధితులుగా నిలువగా, వైరస్ నుంచి 134,700 మంది కోలుకున్నారు. ఇది ఆయా దేశాల అధికారులు, ఏఎఫ్పీ కార్యాలయాలు సేకరించిన డేటా, డబ్ల్యూహెచ్వో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అనాధికారికంగా ఈ వైరస్ వల్ల జరుగుతున్న మరణాలు ఎన్నోఉన్నాయి.
ఫిబ్రవరిలో మొదటి కరోనా మరణాన్ని నమోదు చేసుకున్న ఇటలీ ఇప్పటి వరకు 10,023 మందిని వైరస్ కారణంగా కోల్పోయింది. ఇప్పటికీ 97,472 మంది బాధితులు ఉండగా, 12,384 మంది దీని నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. స్పెయిన్ దేశంలో కూడా ఇప్పటి వరకు 6,528 మంది మరణాలను నమోదు చేసుకుని చైనాను దాటి పోయింది. ఈ దేశంలో 78,747 మంది వైరస్ సోకిన బాధితులు ఉన్నారని ఆదేశ అధికారులు ప్రకటించారు.