రవీంద్ర భారతిలో కర్రసాము వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

కర్రసాము చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి ప్రాంగణంలో కర్ర సాము వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మహిళలకు ఆత్మరక్షణలో మెలకువలు నేర్పించేందుకు వర్క్‌షాపును ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహిళలకు కర్రసాము, కత్తిసాముతోపాటు ఇతర టెక్నిక్స్‌ ను నేర్పించడం జరిగిందన్నారు. కర్రసాములో పీహెచ్‌డీ పట్టా పొందిన ఆకుల శ్రీధర్‌ ఆధ్వర్యంలో వర్క్‌ షాప్‌ నిర్వహించినట్లు చెప్పారు. సమాజంలో మహిళలు, బాలికల పట్ల దాడులు జరుగుతున్నాయని..మహిళలు ఏం చేయలేరనుకుంటారు. కానీ వాళ్లు అన్ని చేయగలరు. మహిళలు తమను తాము రక్షించుకునేలా ఉండేందుకు అందరి కోసం ఆకుల శ్రీధర ఈ వర్క్‌ షాపును నిర్వహించారని అన్నారు.