ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 33,983

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 7,22,664 మంది కాగా, 33,983 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,51,793 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు.
యూఎస్‌లో 1,42,224 కేసులు(2,485 మంది మృతి), ఇటలీలో 97,689 కేసులు(మృతులు 10,779), స్పెయిన్‌లో 80,110 కేసులు(మృతులు 6,803), జర్మనీలో 62,435 కేసులు(మృతులు 541), ఫ్రాన్స్‌లో 40,174 కేసులు(మృతులు 2,606), ఇరాన్‌లో 38,309 కేసులు(మృతులు 2,640), యూకేలో 19,522 కేసులు(1,228 మృతులు), స్విట్జర్లాండ్‌లో 14,829 కేసులు(మృతులు 300), నెదర్లాండ్స్‌లో 10,866 కేసులు(మృతులు 771), బెల్జియంలో 10,836 కేసులు(431 మృతులు), దక్షిణ కొరియాలో 9,661 కేసులు(మృతులు 158), టర్కీలో 9,217 కేసులు(మృతులు 131) నమోదు అయ్యాయి.