నడుచుకుంటూ వెళ్తున్న కూలీలకు సీపీ సజ్జనార్ భరోసా..

కరోన వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు నడుచుకుంటూ వెళుతున్నారు. వారిని గమనించిన సైబరాబాద్ సి పి సజ్జనార్ తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ రాజేంద్రనగర్ లోని ఫంక్షన్ హాల్ లో అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో..సొంతూళ్లకు వెళ్లాలంటే రవాణా సదుపాయం కల్పించడం చాలా కష్టం. అందుకోసమే మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి బియ్యం, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేశాము. సొంత ఊర్లకు వెళ్ళడం వాయిదా వేసుకోవాలని సజ్జనార్ కూలీలకు సూచించారు. ప్రస్తుతం మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడే ఉండాలని, మీకు కావాల్సిన వసతులు లేని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూలీలకు హామీ ఇవ్వడంతో సీపీ సజ్జనార్ కు కూలీలంతా ధన్యవాదాలు తెలియజేశారు.