
కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో వివిధ ప్రవేశపరీక్షల దరఖాస్తుల గడువును నెలరోజులపాటు పొడిగించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఎన్‌టీఏకు సూచించారు. ఈ కఠినమైన పరీక్షా సమయంలో విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి సరైన వసతులు లేకపోవడంతో అప్లికేషన్స్ చివరి తేదీలను నెలరోజులపాటు పొడిగించాలని ఆయన ట్విటర్ ద్వారా ఎన్‌టీఏ కోరారు. ఎన్‌టీఏ విడుదల చేసిన ప్రవేశపరీక్షలైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఐసీఏఆర్, జేఎన్‌యూ ఎంట్రెన్స్, యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ), ఇగ్నో పీహెచ్‌డీ అండ్ మేనేజ్‌మెంట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇప్పటికే నీట్ (యూజీ), జేఈఈ (మెయిన్) పరీక్షలను మే చివరి వారంలో నిర్వహించాలని ఆయన ఎన్‌టీఏను ఆదేశించారు.