
కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన మంత్రి సహాయనిధి(పీఎం కేర్స్ ఫండ్)కి రూ.500 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. కోవిడ్-19పై పోరాటానికి మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు రూ.5కోట్ల చొప్పున సాయం అందజేయనున్నట్లు ప్రకటించింది. కరోనాను ఎదుర్కోవడానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా రూ. 1500 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా టాటా గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ, అదానీ గ్రూప్, ఎల్ అండ్ టీ తదితర సంస్థలు ముందుకొచ్చాయి.