కానిస్టేబుల్‌ యశోదకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సందర్భంగా..మానవత్వంతో స్పందించిన సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ యశోదను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆపన్నులను ఆదుకోవడానికి 100 కిలోల బియ్యం విరాళంగా ఇవ్వడం అభినందనీయమని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఇలాంటి క్లిష్టసమయంలో ఉచిత ఆహార సరఫరాకు సహాయంగా ఉండేలా ఉడతా భక్తిగా బియ్యం అందజేసి ఉదారతను చాటుకొన్నారంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు.